Srikakulam: రాజాంలో ఖాకీల గస్తీ.. తెల్లవారుజామునే ఇళ్లలో తనిఖీలు!

Srikakulam: రాజాంలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 30 బైకులను సీజ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 March 2026 8:34 AM IST
Srikakulam
X

Srikakulam: రాజాంలో ఖాకీల గస్తీ.. తెల్లవారుజామునే ఇళ్లలో తనిఖీలు!

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల సమయంలో ఈ తనిఖీలు చేపట్టారు.

పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి స్థానిక గొల్ల వీధిలో ఒక బృందం, మెంతిపేట ఎస్సీ కాలనీలో మరో బృందం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని సుమారు 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కార్డన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశం గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, నేరస్తులను గుర్తించడం అని డీఎస్పీ తెలిపారు. అనంతరం యువత చేత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డివిజన్‌కు చెందిన సీఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story