Vijayawada: తృటిలో తప్పిన ముప్పు.. ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం!

Vijayawada: విజయవాడ బస్టాండ్ వద్ద సాయి ఆర్కే ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం. 34 మంది ప్రయాణికులు క్షేమం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 March 2026 9:53 AM IST
Vijayawada
X

Vijayawada: తృటిలో తప్పిన ముప్పు.. ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం!

Vijayawada: విజయవాడ బస్టాండ్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు పెను ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. హుటాహుటిన ప్రయాణికులను బస్సు నుంచి కిందకి దించారు బస్సు డ్రైవర్. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ కంపార్ట్ మెంట్ దగ్గర మంటలు వచ్చినట్టు గుర్తించారు. ప్రమాద సమాచారం తెలిసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. కృష్ణ లంకపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story