Nellore: మృత్యుశకటాల్లా ప్రైవేట్ ట్రావెల్స్.. నెల్లూరులో విషాదం

Nellore: నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బ్రహ్మానందం అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 6:19 PM IST
Nellore
X

Nellore: మృత్యుశకటాల్లా ప్రైవేట్ ట్రావెల్స్.. నెల్లూరులో విషాదం

Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు బీసీ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చందలూరు బ్రహ్మానందం (74) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

నిబంధనలు పాటించకుండా, వేగ పరిమితులు లెక్కచేయకుండా రోడ్లపై పరిగెడుతున్న ట్రావెల్స్ బస్సులు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమని మండిపడుతున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచూ తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్లపై కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠి నంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story