Visakhapatnam: ప్రకృతి సాగుకు పట్టం కట్టిన శబల వేడుకలు

Visakhapatnam: విశాఖపట్నం సింహాచలం గోశాల వద్ద 'సేవ్' (SAVE) సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శబల భోజనాల పండుగ విజయవంతమైంది.

GOPI, PENDURTHI
Published on: 3 April 2026 7:56 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ప్రకృతి సాగుకు పట్టం కట్టిన శబల వేడుకలు

విశాఖపట్నం: విజయవంతంగా శబలా భోజనాల సంబరాలు నిర్వహించుకున్నారు అని ఫుడ్ ప్రాసెసింగ్ రాష్ట్ర విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి అన్నారు. శుక్రవారం ఉదయం సింహాచలం గోశాల వద్ద సేవ్ సంస్థ నిర్వహించిన శబల భోజనాల పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తండోపతండాలుగా తరలివస్తున్న అభిమానులను చూస్తుంటే ప్రకృతి వ్యవసాయదారుల మీద పెరుగుతున్న అభిమానానికి నిదర్శనం అన్నారు. ఈ భోజనాలు పండుగ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది అన్నారు. మన ప్రకృతి వనరుల పరిరక్షణ బాధ్యత మనదే అన్నారు.

భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా మాత్రమే పంటలు పండించడం అవసరం అన్నారు. వేలాది మంది ఈ భోజనాలు పండుగను జయప్రదం చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి జి ఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా వ్యవసాయం చేయడం అవసరం అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతుల సంఖ్య పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం, మిలెట్స్ రాంబాబు, ఆయుర్వేద వైద్యులు సుందరరాజ పెరుమాళ్, జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామా, విఎంఆర్ డిఎ చీప్ అర్బన్ ప్లానర్ వి.శిల్ప, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ ప్రసాద్, విశాఖ పోర్టు ట్రస్టు ఉద్యానవన అధికారి రాధిక, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ఉత్తర ఆంధ్ర అధికారి జనార్ధన్ లు మాట్లాడారు.

ఉత్తర ఆంధ్ర జర్నలిస్ట్ ప్రంట్ అధ్యక్షులు వర్మ తమ సంస్థ డైరీలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంకల్ప కళా గ్రామం ప్రతినిధి ఆకుల చలపతి రావు, తులసి నేచురల్స్ సత్యనారాయణ, మేంగొ మేన్ అప్పాజీ, దేశీయ ఆవులు ప్రదర్శన నిర్వహించిన మహేష్ , మేడ్ గార్డెనర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story