Nandyala: మహిళా సాధికారతకు ‘శిల్పా’ భరోసా

Nandyala: నంద్యాల మహిళల ఆర్థిక స్వావలంబనకు శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చేయూతనిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 8:25 PM IST
Nandyala
X

Nandyala: మహిళా సాధికారతకు ‘శిల్పా’ భరోసా

Nandyala: నంద్యాలలో మహిళా సాధికారతకు శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ బలమైన అండగా నిలుస్తోంది. పేదింటి మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో బ్యాంక్ విశేష సేవలు అందిస్తోంది. ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా బ్యాంక్ చైర్‌పర్సన్ నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా 217 మంది మహిళలకు మొత్తం రూ.35 లక్షల 51 వేల రుణాలను పంపిణీ చేశారు.

గత 13 ఏళ్లుగా మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ సేవలు అందిస్తోంది. ఈ రుణాల ద్వారా వేలాది మంది మహిళలు స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ చైర్‌పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా ఈ బ్యాంక్ పనిచేస్తోందని, అనేక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.మహిళలు ప్రణాళికాబద్ధంగా పొదుపు చేయాలి..ఉన్న వనరులతోనే అభివృద్ధి సాధించాలి. పేద మహిళలు స్వయం ఆధారంగా నిలబడటం మా లక్ష్యం. ఏప్రిల్ నెల నుంచి రుణ పరిమితిని రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇది లక్ష రూపాయల వరకు పెంచేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, లక్ష్మీనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు. రుణాలు పొందిన మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాలలో మహిళా ఆర్థిక సాధికారతకు శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఒక నమ్మకమైన చిరునామాగా మారుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story