Anakapalli : అనకాపల్లిలో కొండచిలువల కలకలం.. 6 పాములను పట్టిన స్నేక్ క్యాచర్లు

Anakapalli : అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని పెద్దముషిడివాడా భగవతి లే అవుట్‌లో ఆరు కొండచిలువలు కనిపించడంతో కలకలం రేగింది. స్నేక్ క్యాచర్లు జేసీబీ సాయంతో వాటిని పట్టుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 13 March 2026 10:42 AM IST
Anakapalli : అనకాపల్లిలో కొండచిలువల కలకలం.. 6 పాములను పట్టిన స్నేక్ క్యాచర్లు
X

Anakapalli : అనకాపల్లిలో కొండచిలువల కలకలం.. 6 పాములను పట్టిన స్నేక్ క్యాచర్లు

Anakapalli :అనకాపల్లి జిల్లాలో భారీ కొండచిలువలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. పరవాడ మండలంలోని పెద్దముషిడివాడా పంచాయతీ పరిధిలోని భగవతి లే అవుట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానిక యువకులు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా ఒక్కసారిగా అక్కడ ఆరు కొండచిలువలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

కొండచిలువలు నేలలో దాక్కుని ఉండటంతో వాటిని బయటకు తీసేందుకు జేసీబీ సహాయం తీసుకున్నారు. జేసీబీతో మట్టిని తొలగించి కొండచిలువలను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ప్రక్రియలో మొత్తం ఆరు కొండచిలువలు బయటపడ్డాయి.

అయితే వాటిలో రెండు కొండచిలువలు ఇప్పటికే చనిపోయినట్లు స్నేక్ క్యాచర్లు తెలిపారు. మిగిలిన నాలుగు కొండచిలువలను సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల గ్రామాల పరిసర ప్రాంతాల్లో అడవి జంతువులు కనిపించడం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story