Podalakur: ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

Podalakur: పొదలకూరులో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పునరుద్ధరించనున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 April 2026 6:54 PM IST
Podalakur
X

Podalakur: ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

Podalakur: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసిపి ప్రభుత్వం మూత వేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు 20 లీటర్లు మినరల్ వాటర్ క్యాన్ రెండు రూపాయలకే ఇచ్చేలా 2019లో తెలుగుదేశం ప్రభుత్వం రూ. 4కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిరుపయోగంగా వదిలేసింది.

తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించాలంటే రెండు కోట్ల నలభై లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు సోమిరెడ్డి అదాని కృష్ణపట్నం పోర్టు సి ఎస్ ఆర్ నిధులతో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేలా వారితో మాట్లాడి ఒప్పించారు. దీంతో అదాని కృష్ణపట్నం పోర్ట్ ప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ పథకాన్ని పరిశీలించి తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

అలాగే పొదలకూరులో నిరుపయోగంగా ఉన్న మినీ స్టేడియాన్ని పరిశీలించిన సోమిరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేడియం లోని జంగిల్ క్లియరెన్స్ చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ క్రీడ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులన్నిటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story