Sompeta: గ్రామీణ వైద్యులకు పాఠాలు.. సోంపేటలో అవగాహన కార్యక్రమం!

Sompeta: సోంపేటలో గ్రామీణ వైద్యులకు మెడికవర్ హాస్పిటల్ నిపుణుల అవగాహన సదస్సు. గుండె, కిడ్నీ వ్యాధుల గుర్తింపు, ప్రాథమిక చికిత్సపై డాక్టర్ల కీలక సూచనలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 4:19 PM IST
Sompeta
X

Sompeta: గ్రామీణ వైద్యులకు పాఠాలు.. సోంపేటలో అవగాహన కార్యక్రమం!

Sompeta: సోంపేట మండల కేంద్రంలోని సంస్కార భారతి కళాశాలలో సోంపేట మండలంలోని గ్రామీణ వైద్యులకు సోంపేట గ్రామీణ వైద్యుల అధ్యక్షులు బత్తుల షణ్ముఖరావు, శ్రీనివాస్ పాణిగ్రహి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మెడికవర్ డాక్టర్స్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుండె, కిడ్నీ సమస్యలు కాకుండా కొంతమంది వారికి తెలియకుండా జనరల్ సమస్యలతో బాధపడుతూ ఉంటారని అన్నారు.

అటువంటి వారికి సరైన ప్రాథమిక చికిత్స అందించి, గుర్తింపు పొందిన వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్యులు సందీప్ వర్మ (యూరాలజిస్ట్), మల్ల ఫణీంద్ర (గుండె వ్యాధి నిపుణులు), పైడి సతీష్ (జనరల్ ఫిజీషియన్), టీఎస్ఎన్ మూర్తి (మార్కెటింగ్ మేనేజర్), సిబ్బంది, ఆర్ఎంపీ వైద్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story