Sri Sathya Sai: కదిరిలో కమల వికాసం.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రస్థానం, సభ్యత్వం మరియు విజయాలపై నాయకుల ప్రసంగం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 11:47 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: కదిరిలో కమల వికాసం.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు!

శ్రీ సత్య సాయి జిల్లా: కదిరి పట్టణంలో బిజెపి నేత సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి నివాసం నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.

ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి, కుటాగుల వెంకటేష్, డి.యల్ ఆంజనేయులు, మేకల నాగార్జున, నందిశెట్టి బాబు,మైనుద్దీన్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, నరసమ్మ, తిమ్మరాజు, ఎల్లమ్మ, పార్వతమ్మ, వెంకటేష్ విజయ్ కుమార్, యుగంధర్ ,రఘునాథ్, నజీర్, శబరి , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యంగా నాయకులు మాట్లాడుతూ..

ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఈ రోజు ఒక మహావృక్షంగా మారింది. 1980లో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ శక్తిగా ఎదిగింది. 18 కోట్లకు పైగా సభ్యత్వం దేశవ్యాప్తంగా 1300+MLAలు,330+ MPలు,100+ MLCలు 19 రాష్ట్రాల్లో ప్రభుత్వం (కూటమి తో కలిపి) కేంద్రంలో మరియు రాష్ట్రాలలో స్థిరమైన నాయకత్వం

కేవలం సంఖ్య ఆధారంగా అతిపెద్ద పార్టీ గా అవతరించింది. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా ఎదగగల అవకాశాన్ని ఇచ్చిన పార్టీ సేవ, సమర్పణ, శ్రమ *అనే మూడు సూత్రాలతో దేశాన్ని అభివృద్ధి మార్గం వైపు నడిపిస్తున్న పార్టీగా అత్యంత శక్తివంతమైన ఆలోచనలు, ఉద్యమ స్ఫూర్తి, దేశభక్తి భావం తో నిండిన కార్యకర్తల కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో శక్తివంతమైన పార్టీ గా నిలిచింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story