Kotabommali: ఎన్టీఆర్కు నివాళులతో కోటబొమ్మాళిలో వేడుకలు
Kotabommali: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Kotabommali: ఎన్టీఆర్కు నివాళులతో కోటబొమ్మాళిలో వేడుకలు
Kotabommali: కోటబొమ్మాళి(శ్రీకాకుళం) ఈరోజు కోటబొమ్మల మండలం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజా నాయకులు మరియు పార్టీ కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా కింజరాపు అచ్చం నాయుడు తెలుగుదేశం పార్టీ జండా నీ ఎగరవేయడం తో పాటుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన రాష్ట్రానికి మరి తెలుగు ప్రజలకు చేసిన సేవలను తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని దేశం దశ దిశల వ్యాప్తి చేసిన N.T రామారావు గారిని మరియు ఆయన రాష్ట్రానికి చేసిన అభివృద్ధి నీ ప్రశంసించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మంత్రి ధ్వజమెత్తారు,
జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడమే చోటా నాయకుల పని అని,
తెలుగుదేశం పార్టీ హయాంలో భావనపాడులో మంజూరు చేసిన పోర్టును మూలపేటకు మార్చి ఏం సాధించారని ప్రశ్నించారు.గత ఐదేళ్లలో 22% పనులు మాత్రమే పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో 75% పైగా పనులు పూర్తి చేశామని వెల్లడి,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో రహదారి కోసం 384 ఎకరాల ఉప్పు భూములను కేంద్రం 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది అని కూటమి ప్రభుత్వ ఘనతను చాటి చెప్పారు,
2014–2019 మధ్య వంశధార ప్రాజెక్టుకు ₹600 కోట్లు మంజూరు చేసి 96% పనులు పూర్తి చేశామని స్పష్టం మరియు మిగిలిన 4% పనులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు, జూన్ నాటికి వంశధార ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు,




