Kurupam: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది... ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

KVD Varma
Published on: 16 March 2026 10:39 PM IST
Kurupam: కేదారిపురం గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి
X

Kurupam

Kurupam: వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కేదారిపురం గ్రామంలో సోమవారం రైతన్నా! మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు జగదీశ్వరి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రైతులు కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో ఏం చేయబోతుందనే అంశాలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. సూపర్ సిక్స్ హామీలో భాగముగా అన్నదాత సుఖీభవ నిధులు రైతులు ఖాతాలో జమ చేసిన ఘనత lముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అని అన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు, ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్పర్సన్ కడ్రక కళావతి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్, నియోజకవర్గ ఎస్టి సెల్ అధ్యక్షులు మండంగి భూషణరావు, ఎంపిడిఓ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

KVD Varma

KVD Varma

Next Story