Satyavedu: పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల చిన్నారిని చంపేసిన కన్నతల్లి!

Satyavedu: కన్నపేగు అని చూడకుండా, పాలిచ్చి లాలించాల్సిన తల్లి కాలయముడుగా మారింది.

Arun Chilukuri
Published on: 26 March 2026 4:01 PM IST
Satyavedu
X

Satyavedu: పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల చిన్నారిని చంపేసిన కన్నతల్లి!

Satyavedu: కన్నపేగు అని చూడకుండా, పాలిచ్చి లాలించాల్సిన తల్లి కాలయముడుగా మారింది. పాల కోసం ఏడుస్తోందని ఆరు నెలల పసికందును గొంతు నులిమి చంపేసిన అమానుష ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని నరసరాజు అగ్రహారంలో గురువారం చోటుచేసుకుంది.

క్షణికావేశంలో ఘోరం

సీఐ మురళి వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని వెంగలచేరికి చెందిన హైమవతి, వెంకటేశ్‌ దంపతులు ఉపాధి కోసం సత్యవేడు పరిసర ప్రాంతాలకు వలస వచ్చారు. ఇక్కడ సిమెంట్‌ ఇటుకల తయారీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు రుత్విక్‌తో పాటు ఆరు నెలల చిన్నారి ఉంది.

గురువారం ఉదయం ఆరు నెలల పసిపాప ఆకలితో పాల కోసం గట్టిగా ఏడుస్తుండటంతో తల్లి హైమవతి తీవ్ర అసహనానికి గురైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి చిన్నారి గొంతు నులిమేయడంతో, ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

పోలీసుల విచారణ

చిన్నారి మృతిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సత్యవేడు సీఐ మురళి, ఎస్సై సాయినాథ్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కన్నతల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story