Gokavaram: గుమ్మళ్ళదొడ్డిలో ముగిసిన వల్మీక వెంకన్న వార్షికోత్సవాలు

Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వల్మీక వెంకటేశ్వర స్వామి ఆలయ 4వ వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 9:02 PM IST
Gokavaram
X

Gokavaram: గుమ్మళ్ళదొడ్డిలో ముగిసిన వల్మీక వెంకన్న వార్షికోత్సవాలు

Gokavaram: గుమ్మళ్ళదొడ్డిలోని ప్రసిద్ధ వల్మీక వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాల్గవ వార్షికోత్సవ కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం స్వామివారి కల్యాణ వేడుకలను శ్రీమన్నారాయణాచార్యులు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణ వేడుకను వీక్షించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణాచార్యులు మాట్లాడుతూ , వల్మీక క్షేత్రంలో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం, వార్షికోత్సవాలు, తదితర ఉత్సవాల నిర్వహణ పట్ల గ్రామస్తులు చూపుతున్న భక్తి శ్రద్ధలు ప్రశంసించదగ్గవన్నారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులు నేతృత్వంలో కల్యాణోత్సవం అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ను గ్రామంలోని ప్రధాన వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కోలాటం, తదితర సాంస్కృతిక ప్రదర్శనల నడుమ నిర్వహించిన ఈ గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story