ప్రారంభమైన వసంతోత్సవ వేడుకలు.. అంకురార్పణతో క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ!

Penchalakona: నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి వసంతోత్సవాలు సోమవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 8:18 PM IST
Penchalakona
X

ప్రారంభమైన వసంతోత్సవ వేడుకలు.. అంకురార్పణతో క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ!

Penchalakona: నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం లో వెలసివున్న లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం నందు ఈ రోజు నుండి 2వ తేది వరకు జరుగు వసంత ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో భాగంగా విశ్వాక్షేణ ఆరాధన , పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకరార్పణ హోమం నిర్వహించారు,ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితనం మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవముగా జరిగింది, కార్యక్రమం లో భాగంగా 4వ తేది స్వాతి నక్షత్రం సందర్బంగా పెనుశిల లక్ష్మి నృసింహస్వామి బంగారు గరుడ వాహనం పై భక్తులకు దర్శనమిస్తాడని ఆలయ ఈ వో శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story