Nellore: లెక్కలు పక్కన పెట్టి బ్యాట్ పట్టిన ఆడిటర్లు.. విజేతగా విజయవాడ టీమ్
Nellore: నెల్లూరులో ముగిసిన చార్టెడ్ అకౌంటెంట్స్ క్రికెట్ టోర్నమెంట్. ఏడు జిల్లాల టీమ్స్ మధ్య సాగిన పోరులో విజయవాడ టీమ్ విన్నర్‌గా నిలిచింది.
Nellore: లెక్కలు పక్కన పెట్టి బ్యాట్ పట్టిన ఆడిటర్లు.. విజేతగా విజయవాడ టీమ్
Nellore: నెల్లూరులో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆధ్వర్యంలో రసవత్తరంగా సాగింది "చార్టెడ్ అకౌంటెంట్ క్రికెట్ టోర్నమెంట్"..
ఏడు జిల్లాల నుంచి పాల్గొన్న చార్టెడ్ అకౌంటెంట్ టీమ్స్, గత పది రోజులు పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో. హోరాహోరీగా తలపడిన టీమ్స్ లోంచి, విజేతగా విజయవాడ చార్టెడ్ అకౌంట్ టీం నిలిచింది. రన్నర్స్ గా నెల్లూరు చార్టెడ్ అకౌంట్ టీం నిలిచింది. ఈ సందర్భంగా
విజేతలకు బహుమతులు అందజేశారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరికి ఆటవిడుపు ముఖ్యమని, క్రీడలు జీవితంలో ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.
ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండే చార్టెడ్ అకౌంటెంట్స్, తమ అమూల్యమైన సమయాన్ని ఉపయోగించి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అన్నారు ప్రశాంతి రెడ్డి. ఇలా అందర్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఎమ్మెల్యేలు అంతా కలిసి క్రికెట్ టోర్నమెంట్ ఆడిన విషయం గుర్తు చేశారు.
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఓ వైపు, చార్టెడ్ అకౌంటెంట్స్ మరో వైపు ఇలా అందరూ కలిసి క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరినీ ఇంట్రడ్యూస్ చేసిన ఆడిటర్ శ్రీనివాస్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.. వారి ఆహ్వానం తో. తనకు ఈ విషయం తెలిసిందన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో. తాను పాల్గొనడం జరిగిందని తన సంతోషం వ్యక్తం చేశారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.




