Vizag: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పోరాటం.. విశాఖలో కీలక సమావేశం

Vizag: పశ్చిమాసియా యుద్ధంలో జర్నలిస్టుల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

GOPI, PENDURTHI
Published on: 4 April 2026 4:19 PM IST
Vizag
X

Vizag: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పోరాటం.. విశాఖలో కీలక సమావేశం

Vizag: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధములో పలువురు జర్నలిస్టులు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.. శనివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీవో హోం లో వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు సంయుక్త కార్యవర్గసమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ ప్రధానకార్యదర్శి జి శ్రీనివాసరావులు మాట్లాడుతూ పచ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే ధరల భారం పెరిగి ఎంతో మంది నిరుపేదలు రోడ్డున పడుతున్నా రన్నారు.

విధి నిర్వహణలో వీర జవాన్లతో పాటు అధికారులు అనేకమంది జర్నలిస్టులు మృతి చెందడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మృతి చెందిన జర్నలిస్టుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

ఇళ్ల స్థలాల కోసం విశ్వ ప్రయత్నాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు తక్షణమే ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు.. ఇండ్లు కేటాయించాలని ఇందుకోసం తమ యూనియన్ పరంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నారాయణలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతామన్నారు.

అలాగే జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైన ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని.. వెటరన్ జర్నలిస్టులకు జిల్లా కేంద్రాల్లో బస్సు సదుపాయం కల్పించాలని.. చిన్న మధ్య పత్రికలకు సంబంధించిన ఎం ప్యానల్ మెంట్ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే సమాచార శాఖ మంత్రినికోరినట్లు వీరు చెప్పారు..

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీధవళేశ్వర్ రవి కుమార్, ఉపాధ్యక్షులుపక్కి వేణు, బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష కార్యదర్శి ఈరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యవర్గ ప్రతినిధులుబొబ్బర ప్రసాద్, శర్మ, హరి, రవి, అప్పలనాయుడు,, రమేష్, నెల రాజు, రంగధామం, తదితరులంతా పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story