Nandyala: ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య.. నలుగురు అరెస్ట్!

Nandyala: నంద్యాల జిల్లా బనగానపల్లెలో భర్త హత్య కేసు ఛేదింపు. వివాహేతర సంబంధం కోసం భర్తను హతమార్చిన భార్య మేరీ మరియు ప్రియుడు మధు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 2:56 PM IST
Nandyala
X

Nandyala: ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య.. నలుగురు అరెస్ట్!

బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప వెంచర్ల సమీపంలో ఇటీవల జరిగిన హత్య కేసు సుఖాంతమైంది. డోన్ పట్టణానికి చెందిన మేరీ అనే మహిళ, తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను అత్యంత దారుణంగా అంతం చేసింది. ఈ కేసులో భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. డోన్ పట్టణానికి చెందిన మేరీకి మధు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న మేరీ, ప్రియుడు మధుతో కలిసి పథకం రచించింది. నంద్యాలకు వెళ్దామని భర్తను నమ్మించి, మార్గమధ్యలో కైప వెంచర్ల వద్దకు తీసుకెళ్లి నిందితులు పక్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఈ కేసును సవాలుగా తీసుకున్న బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి నేతృత్వంలోని బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. శాస్త్రీయ ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి, భార్య మేరీ, ప్రియుడు మధుతో సహా మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story