YV Subba Reddy: ఏపీకీ ప్రత్యేక హోదా అంశం బిల్లులో లేదు

YV Subba Reddy: అమరావతి బిల్లును రాజ్యసభలో వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడుందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 2 April 2026 3:51 PM IST
YV Subba Reddy
X

 YV Subba Reddy: ఏపీకీ ప్రత్యేక హోదా అంశం బిల్లులో లేదు

YV Subba Reddy: అమరావతి బిల్లును రాజ్యసభలో వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడుందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఏపీకీ ప్రత్యేక హోదా అంశం బిల్లులో లేదన్నారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం జరగలేదని తెలిపారు. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదన్నారు.

అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వివరించారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు సేకరించారని... ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మౌలిక వసతులకే 2లక్షల కోట్లు అంటున్నారని... రెండేళ్లలోనే 3లక్షల 40వేల కోట్ల అప్పు చేశారని తెలిపారు. అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story