Gokavaram: వైసీపీ ఉనికిపై మీడియా ప్రశ్నలు.. వివరణ ఇచ్చిన ఏడుకొండలు
Gokavaram: గోకవరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికిపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర కార్యదర్శి గుల్లా ఏడుకొండలు స్పందించారు.
Gokavaram: వైసీపీ ఉనికిపై మీడియా ప్రశ్నలు.. వివరణ ఇచ్చిన ఏడుకొండలు
Gokavaram: రాష్ట్రంలో హిందూ ధర్మం, మహిళలపై దాడులు, డ్రగ్స్ నేను ఇష్టమున ఈ నియోగించిన ప్రజాప్రతినిధులు, అబద్ధపు ప్రకటనలు ఇలా ఎన్నో ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించడం లేదని అసలు గోకవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అంటూ మీడియా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుల్లా ఏడుకొండల స్పందించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదిష్టానం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుని తొలగించాలని రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా గోకవరం మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు అనంతరం మీడియా సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గుల్లా ఏడుకొండలు బదిలీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందని నియోజవర్గ ఇన్చార్జి మాజీ మంత్రివర్యులు తోట నరసింహం గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు మేము చేస్తూ వెళుతున్నామని,
ఒక్కొక్కసారి నియోజకవర్గ స్థాయిలోనూ ఒక్కొక్కసారి జిల్లా స్థాయిలోనూ కార్యక్రమాలు చేయడం తప్పనిసరి కారణంగా మండల స్థాయిలో లోటు ఉందని అంగీకరిస్తూ భవిష్యత్తులో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని ప్రజా సమస్యల మీడియా దృష్టికి ఏవైనా వచ్చిన తక్షణం తన చేరవేయాలంటూ కోరారు. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని మీ పార్టీ నాయకుడు మండలంలోని పుణ్యక్షేత్రమైన తంటికొండ దేవస్థానం మెట్లు కడిగారు,
కదా మరి మీ పార్టీ తరఫున మీరు ఒప్పుకున్నట్లు కదా అని అడిగిన ఒక ప్రశ్నకు రాష్ట్ర పార్టీ కార్యదర్శి గుల్లా ఏడుకొండలు స్పందిస్తూ ఈ విషయం నాకు తెలియదని మండలంలోని పార్టీ అధ్యక్షుడు మండల పరిషత్ అధ్యక్షుడు ఇలా ముఖ్యమైన నేతలు అంతా కూర్చుని చర్చించుకుని మా ఇన్చార్జి దృష్టిలో పెట్టి అవసరం అయితే చర్యలు తీసుకోవడం కూడా వెనకాడబొమని స్పష్టం చేశారు.




