Vizianagaram: బొబ్బిలిలో 'స్మార్ట్' సందడి.. 146 మంది సెర్ప్ సహాయకులకు 5G ఫోన్లు!
Vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలిలో గ్రామ సంఘాల సహాయకులకు (SERP) ఎమ్మెల్యే బేబీనాయన 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.
Vizianagaram: బొబ్బిలిలో 'స్మార్ట్' సందడి.. 146 మంది సెర్ప్ సహాయకులకు 5G ఫోన్లు!
Vizianagaram: బొబ్బిలి గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీనాయన. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Society for Elimination of Rural Poverty - SERP) నియోజకవర్గ స్థాయి గ్రామ సంఘాల సహాయకులకు ప్రభుత్వం ఇచ్చిన 5G స్మార్ట్ ఫోన్లను ఈరోజు బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బేబీనాయన చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ..
మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడం, ఆర్థిక సాధికారత కల్పించడం మరియు పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తున్న ఒక ప్రత్యేక సంస్థ SERP అని పేర్కొన్నారు. ఇది గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ, మహిళలకు స్వయం ఉపాధి, రుణ సదుపాయం మరియు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు.. బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలలో పనిచేస్తున్న 146 మంది సహాయకులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. బొబ్బిలి - 42, తెర్లాం - 43, బాడంగి - 31, రామభద్రపురం - 30 స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.




