Chintoor: చింతూరు మండలం చూటూరులో జనసేన పార్టీలోకి భారీ చేరికలు!

Chintoor: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చూటూరులో జనసేన పార్టీలోకి 80 కుటుంబాల చేరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, గిరిజనాభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెల్లడి.

RAJESH REDDY, CHINTOOR
Published on: 2 Nov 2026 1:43 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు మండలం చూటూరులో జనసేన పార్టీలోకి భారీ చేరికలు!

Chintoor: చింతూరు మండలం చూటూరు గ్రామంలో జనసేన పార్టీకి భారీ మద్దతు లభించింది. గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు పాయం నాగరాజు, పాయం వినోద్, కొత్తపల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అభ్యర్థి తీగల కవిత సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు గ్రామస్తులు తెలిపారు.

గిరిజన గ్రామాలకు న్యాయం జరగాలన్నా, మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా పవన్ కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యమని యువత అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కాకి స్వామి, రాగల సురేష్, ప్రధాన కార్యదర్శి బేడే సతీష్, మిడియం రమణమ్మ, మల్లిపూడి సతీష్, పయ్యాల ప్రవీణ్, సవలం వినోద్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR