Srikakulam: ఫలితాల్లో సత్తా చాటిన కస్తూర్బా బాలికలు.. 93 శాతం ఉత్తీర్ణతతో కేక!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
Srikakulam: ఫలితాల్లో సత్తా చాటిన కస్తూర్బా బాలికలు.. 93 శాతం ఉత్తీర్ణతతో కేక!
Srikakulam: రణస్థలం మండలం, లంకపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు.
2వ సంవత్సరం MPC విభాగంలో డి. జయలక్ష్మి 1000 మార్కులకు గాను 956 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. 2వ సంవత్సరం MPCలో మొత్తం 27 మంది విద్యార్థులకు గాను 25 మంది ఉత్తీర్ణత సాధించి 93% ఫలితాలు నమోదు చేశారు.
1వ సంవత్సరంలోనూ విద్యార్థినులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. మొత్తం 40 మందికి 34 మంది ఉత్తీర్ణులై 85% ఉత్తీర్ణత సాధించారు. చోడిపల్లి నిఖిల 470 మార్కులకు గాను 453 మార్కులు సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థినుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
Next Story




