Mullapudi Venkata Ramana: జయంతి వేడుకలు: మూడు నూతన పుస్తకాల ఆవిష్కరణ!

Mullapudi Venkata Ramana: ముళ్లపూడి వెంకటరమణ 95వ జయంతి సందర్భంగా '50 ఏళ్ల భక్తకన్నప్ప' చిత్ర ప్రదర్శన, పుస్తకావిష్కరణలు ఘనంగా జరిగాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్

RAJESH,	WEST ZONE
Published on: 29 Jun 2026 10:38 AM IST
Mullapudi Venkata Ramana
X

Mullapudi Venkata Ramana: జయంతి వేడుకలు: మూడు నూతన పుస్తకాల ఆవిష్కరణ!

ముళ్లపూడి వెంకటరమణ: 95వ జయంతి సందర్భంగా అక్షజ్ఞ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో, ముళ్లపూడి కుటుంబ సభ్యుల సౌజన్యంతో '50 ఏళ్ల భక్తకన్నప్ప' చిత్ర ప్రదర్శన నిర్వహించారు.చిత్ర ప్రదర్శనకు ముందు అక్షజ్ఞ పబ్లికేషన్స్ ప్రచురించిన 'గిరీశం లెక్చర్లు', 'ఇద్దరమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు', 'భక్తకన్నప్ప వెండితెర నవల' పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హాస్యానందం మాసపత్రిక నిర్వహించిన ముళ్లపూడి వెంకటరమణ సింగిల్ పేజీ హాస్యకథల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకుడు కె. ఐ. వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శకులు ఎస్. గోపాల్ రెడ్డి, ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు, ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సి.వి.ఎల్.ఎన్. ప్రసాద్, హాస్యానందం మాసపత్రిక ఎడిటర్ రాము తదితరులు హాజరయ్యారు.

అక్షజ్ఞ పబ్లికేషన్స్ ప్రతినిధి వెంకట్ స్వాగతోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ముళ్లపూడి వెంకటరమణ తెలుగు సాహిత్యం, సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలను వక్తలు కొనియాడారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story