అద్దంకిలో అధికారుల మెరుపు దాడులు: ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరి గుట్టురట్టు.. 10 మంది ఒడిశా కార్మికులకు విముక్తి!

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ఇటుక బట్టీలపై కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అధికారులు సంయుక్తంగా వెట్టిచాకిరి నిర్మూలన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Kolla Singaiah, Addanki
Published on: 9 Jun 2026 7:58 PM IST
అద్దంకిలో అధికారుల మెరుపు దాడులు: ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరి గుట్టురట్టు.. 10 మంది ఒడిశా కార్మికులకు విముక్తి!
X

అద్దంకి / ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా అద్దంకి లో వెట్టి చాకిరి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు

జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు మేరకు వెట్టి చాకిరీ నుండి కార్మికుల విముక్తి కోసం స్పెషల్ టీం గా మండల రెవెన్యూ శాఖ, విద్యా శాఖ, వైద్య ఆరోగ్యశాఖ శాఖ , లేబర్ డిపార్ట్మెంట్ , ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒంగోలు సంయుక్తంగా కలిసి ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు.

అద్దంకి పట్టణం లోని కలవకు రోడ్డు వద్ద రెండు ఇటుక బట్టీల వద్ద కార్మికుల ను తనిఖీలు నిర్వహించారు.

కోనేటి శ్రీను ఇటుక బట్టి వద్ద ఒరిస్సాకు చెందిన పదిమంది కార్మికులను వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించి , ఆరోగ్య పరీక్షలు చేయించి వారి స్వగ్రామానికి పంపిస్తున్నట్లు లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story