Nellore: 90 లీటర్ల కల్తీ పాలు సీజ్.. దగదర్తిలో అధికారుల ఆకస్మిక దాడి!

Nellore: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి.

V. Narasimhulu, Nellore
Published on: 18 April 2026 12:08 PM IST
Nellore
X

Nellore: 90 లీటర్ల కల్తీ పాలు సీజ్.. దగదర్తిలో అధికారుల ఆకస్మిక దాడి!

Nellore: ఆయిల్, షుగర్, సాల్ట్ కలిపి.. ఏకంగా "పాలు" తయారు చేస్తున్నారు.. మీరు చదివింది కరెక్టే ఇక్కడ ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ.. పాలు తయారు చేస్తున్నారు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు..

నెల్లూరు జిల్లా, దగదర్తి మండలం, దామవరం గ్రామంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు ఓ ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ తయారవుతున్న కల్తీ పాలు చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ అయ్యారు..

తనిఖీ సమయంలో అక్కడ మూడు క్యాన్లలో సుమారు 90 లీటర్ల పాలు ఉన్నట్లు గమనించారు. విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి..

ఆయిల్, షుగర్, సాల్ట్ వంటి పదార్థాలను మిక్సీలో కలిపి, పాలను కల్తీ చేసి, ఆ పాలను చందశేఖరపురంలోని విఘ్నేశ్వర డైరీకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఉన్న మూడు పాల క్యాన్ల నుండి నమూనాలను సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షల నిమిత్తం నమూనాలు ప్రయోగశాలకు పంపించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story