Chintoor: కూనవరం ఎంపీటీసీ-1 కూటమి అభ్యర్థిగా కొయ్యల కనక లక్ష్మీ ప్రసన్న నామినేషన్!
Chintoor: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం ఎంపీటీసీ-1 కూటమి అభ్యర్థిగా కొయ్యల కనక లక్ష్మీ ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు.
Chintoor: కూనవరం ఎంపీటీసీ-1 కూటమి అభ్యర్థిగా కొయ్యల కనక లక్ష్మీ ప్రసన్న నామినేషన్!
Chintoor: కూనవరం ఎంపీటీసీ-1 కూటమి అభ్యర్థిగా కొయ్యల కనక లక్ష్మీ ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు.కూనవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకుని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కనక లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ కూటమి నాయకత్వం తన పై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆశీస్సులతో కూనవరం-1 స్థానంలో ఘన విజయం సాధించి,ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని,స్థానిక సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు, టిడిపి సీనియర్ నాయకులు బరపాటి ప్రకాష్ రావు, సోమకు సత్యనారాయణ, రసూల్,గ్రామ శాఖ అధ్యక్షులు హెచ్ రవి జనసేన మండల అధ్యక్షులు దాసరి నరేంద్ర మాజీ సర్పంచ్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.




