Chinturu: రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు 'బి-ఫామ్' ఎవరికోనని ఆసక్తి
Chinturu: పోలవరం జిల్లా చింతూరు-2 ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా సయ్యద్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు చేశారు.
Chinturu: రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు 'బి-ఫామ్' ఎవరికోనని ఆసక్తి
Chinturu: చింతూరు-2 ఎంపీటీసీ స్థానానికి కూటమి తరఫున సయ్యద్ ఆసిఫ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.టిడిపి మండల అధ్యక్షులు ఎండి జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో ఆసిఫ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.గత ఎన్నికల్లో ఈ ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం జరిగింది.
ఆసిఫ్ నామినేషన్ వేసినప్పటికీ బి ఫామ్ ఏ అభ్యర్థి దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.చింతూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను టిడిపి,జనసేన, బిజెపి ల మధ్య ఇంకా సీట్లు సర్దుబాటు జరగలేదు.నామినేషన్ దాఖలకు గడువు రేపటితో ముగియనుండటంతో టిడిపి,జనసేన,బిజెపి పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది.
ఎంపీటీసీ సీట్ల సర్దుబాటు జరిగిన పిదప ఆయా అభ్యర్థులు పోటీలో ఉండి మిగతా అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేసుకుంటారని తెలుస్తుంది.కూటమి తరపున ఏ అభ్యర్థులు బరిలో ఉంటారో ఎదురు చూడక తప్పదు.




