Kurnool: ఆలూరులో వైకుంఠం జ్యోతి సందడి.. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందడి.

Bheemalinga, Aluru
Published on: 14 April 2026 12:20 PM IST
Kurnool
X

Kurnool: ఆలూరులో వైకుంఠం జ్యోతి సందడి.. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి!

కర్నూలు జిల్లా: ఆలూరు లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయ సాధనలో ముందుకు సాగాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. సమాజంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని అందరూ సమానమే అని చాటిచెప్పారన్నారు. మన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తిని ప్రపంచమే మన రాజ్యాంగం వైపు చూసేలా ఆయన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. అంబేడ్కర్ జీవించే హక్కు కల్పించారని ఆమె స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story