Nellore: అంబేద్కర్ ఆశయాలే దిక్సూచి.. ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో వేడుకలు!
Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీ మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.
Nellore: అంబేద్కర్ ఆశయాలే దిక్సూచి.. ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో వేడుకలు!
నెల్లూరు జిల్లా: ఉదయగిరి ఆచార్య యన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ కళాశాలలో Dr. B. R. Ambedkar 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇంచార్జి అసోసియేట్ డీన్ డా. ఏ.వి.ఎస్. దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సమాజంలో సమానత్వం కోసం విశేష కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి ఉన్నత విద్య సాధించి దేశానికి చేసిన సేవలను వివరించారు. ముఖ్యంగా రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు.
Next Story




