Kalyandurg: సోలార్ పథకంతో కరెంటు కష్టాలకు చెక్!
Kalyandurg: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గాజులపల్లిలో పీఎమ్ సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించారు.
Kalyandurg: సోలార్ పథకంతో కరెంటు కష్టాలకు చెక్!
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గాజులపల్లి గ్రామంలో పీఎమ్ సూర్య ఘర్ పథకాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబం పీఎమ్ సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా నెలకు సుమారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు. బీసీ వర్గాలకు సబ్సిడీ కలిపి సుమారు 98 శాతం వరకు రాయితీ అందుతుందని, మిగిలిన మొత్తం తక్కువగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
ఇప్పటికే నియోజకవర్గంలో 2438 కుటుంబాలకు సుమారు రూ.27.50 కోట్ల వ్యయంతో సోలార్ వ్యవస్థలు అందించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గ్రామంలో తాగునీటి సమస్యపై స్పందిస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. రెండు రోజుల్లో మోటారు మరియు నీటి ట్యాంకు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని మహిళలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.




