Anakapalli: గురుకులంలో ఫుడ్ పాయిజన్ వదంతులు.. ఖండించిన ప్రిన్సిపాల్!
Anakapalli: చోడవరం బీసీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగలేదని ప్రిన్సిపాల్ రజిత స్పష్టం చేశారు.
Anakapalli: గురుకులంలో ఫుడ్ పాయిజన్ వదంతులు.. ఖండించిన ప్రిన్సిపాల్!
Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం లో ని మహాత్మ జ్యోతి పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వచ్చిన వదంతులను పాఠశాల యాజమాన్యం ఖండించింది.
పాఠశాలలో మొత్తం 238 మంది విద్యార్థినులు ఉండగా, ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన 39 మంది తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 190 మంది విద్యార్థినులు పాఠశాలలో ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని తరగతులకు చెందిన 13 మంది విద్యార్థినులకు చర్మ వ్యాధులు రావడంతో, వారిని సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి వైద్యం అందించారు.
అధికారులు అప్రమత్తం, స్థానిక ఎమ్మార్వో ఎల్ రామారావు పాఠశాలను సందర్శించి, విద్యార్థినుల నుండి వివరాలు తెలుసుకున్నారు.. ఎంపిడివో అంజనేయలు కూడా విద్యార్థినులను విచారించి, వారి పేర్లు నమోదు చేసుకొని చర్మవ్యాధులు వచ్చిన విషయం పై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని చెప్పారు.
ఇదే విషయంపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపాల్ రజిత, ఫుడ్ పాయిజన్ జరగలేదని స్పష్టం చేశారు. పాఠశాల పరిసరాలు సక్రమంగా ఉన్నాయని, 13 మంది విద్యార్థినులకు కేవలం చర్మవ్యాధులు మాత్రమే వచ్చాయని, వారికి అవసరమైన వైద్యం అందించామని తెలిపారు.
ఇలా సోషల్ మీడియాలో నిరాధార పోస్టులు చేసి ప్రభుత్వం మరియు తమ పాఠశాల పై బురదజల్లే వారిపై పై అధికారుల అనుమతితో పోలీసులకు పిర్యాదు చేస్తామని తెలిపారు.




