Nellore: జగన్‌కు మంత్రి ఆనం స్ట్రాంగ్ వార్నింగ్!

Nellore: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

M Satya Peter, Atmakur
Published on: 14 April 2026 6:39 PM IST
Nellore
X

Nellore: జగన్‌కు మంత్రి ఆనం స్ట్రాంగ్ వార్నింగ్!

Nellore: వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఏక పదజాలంతో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం. ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంలో మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. మావిగన్ పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు ఆనం.

గత ఐదేళ్ల లో డ్రగ్ కల్చర్ పెట్టి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్ర పదజాలంతో మంత్రి ఆనం విమర్శలు చేశారు. రేపు మత్స్యకారుల సమస్యపై మాట్లాడాలంటూ జువ్వలధిన్నె వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని వారితో మాట్లాడతారు అంటూ ప్రశ్నించారు మంత్రి ఆనం. జువ్వలదిన్నెలో మత్స్యకార వర్గాలకు కూటమి ప్రభుత్వం మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంటే దానిని అడ్డుకునేందుకు అడ్డుకట్ట వేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుటిలయత్నాలకు పాల్పడుతున్నారంటూ ఆనం ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల కోసం రావడం లేదు... కాంట్రాక్టర్లు బెదిరించి కమిషన్లు గుంజుకునేందుకు వస్తున్నారు అంటూ ఆరోపించారు. రాష్ట్ర రహదారులపై జగన్నాథ రథచక్రాలు తిరుగుతున్నాయి.. వాటి కిందపడి నువ్వు... మీ పార్టీ నాయకులు నలిగిపోతారు జాగ్రత్త అంటూ జగన్మోహన్ రెడ్డి ను ఉద్దేశిస్తూ ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరికలు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడరు. సొంత ఊర్లో ఎంపీటీసీని గెలిపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తమను బెదిరించడమేమి టం టూ ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌనంగా ఉంటున్నామని జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతూ... హెచ్చరికలు చేస్తున్నారు... మా నాయకత్వం కళ్ళు తెరిస్తే దబిడి దిబిడే అంటూ ఆనం తమదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు చేశారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story