Amaravati: రాష్ట్రoలో కొనసాగుతున్న కరోనా కేసులు.. మరో 7 కేసులు నమోదు

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7 కరోనా కేసులు నమోదు. కడపలో అత్యధికంగా 8 కేసులు. నలుగురు మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 July 2026 8:51 AM IST
Amaravati
X

Amaravati: రాష్ట్రoలో కొనసాగుతున్న కరోనా కేసులు.. మరో 7 కేసులు నమోదు

Amaravati: గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు చొప్పున రికార్డ్. ధృవీకరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. తాజా కేసులతో రాష్ట్రంలో 26 చేరిన కరోనా బాధితులు. ఇప్పటివరకు 145 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ.

కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు,గుంటూరులో 6, తూర్పుగోదావరిలో 3, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండేసి కేసులు. విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఎన్టీఆర్‌, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు.

ప్రస్తుతం పది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు.

మృతులందరికీ కరోనా నిర్ధారణకు ముందే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొన్న ఆరోగ్యశాఖ.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story