AP Cabinet Decisions: గోదావరి పుష్కరాలకు రూ.50 కోట్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
AP Cabinet Decisions: ఏపీ సీఎం నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
AP Cabinet Decisions: గోదావరి పుష్కరాలకు రూ.50 కోట్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. అలాగే చేనేత కార్మికుల సంక్షేమం కోసం 'నేతన్నల సేవలో' పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.25,000 ఆర్థిక సాయం నేరుగా అందించనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యమిస్తూ మొదటి ప్రైవేటు మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. భీమవరంలో 'విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్' ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నారు.
శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థలం లీజును పొడిగిస్తూ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఏపీ మార్క్‌ఫెడ్ సంస్థ సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకునే రూ.300 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు (గ్యారంటీ) ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక సేవల విస్తరణ పనులకు మరియు వివిధ అభివృద్ధి సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఒకే చెప్పినట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.




