CM Chandrababu: ఏపీలో పొదుపు మంత్రం.. కాన్వాయ్ వాహనాలు తగ్గించుకున్న చంద్రబాబు, పవన్!

CM Chandrababu: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 14 May 2026 6:30 AM IST
CM Chandrababu
X

CM Chandrababu: ఏపీలో పొదుపు మంత్రం.. కాన్వాయ్ వాహనాలు తగ్గించుకున్న చంద్రబాబు, పవన్!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇంధన వాడకాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, తమ భద్రతా కాన్వాయ్‌లలోని వాహనాల సంఖ్యను ఏకంగా 50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లా పర్యటనల సమయంలో తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను ఆదేశించారు. ఈ పొదుపు చర్యలు కేవలం తనకే పరిమితం కాకుండా, మంత్రులు మరియు ఇతర వీఐపీలు కూడా అనవసర వాహనాలను తగ్గించుకునేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా పొదుపు మంత్రాన్ని పాటించాలని ఆయన సూచించారు.

ముఖ్యమంత్రి బాటలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా నడిచారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధన పొదుపు పాటించాలని ప్రధాని మోదీ సూచించారని, ఆ స్ఫూర్తితోనే తన కాన్వాయ్ వాహనాలను 50 శాతం తగ్గించుకుంటున్నట్లు ఆయన భద్రతా సిబ్బందికి తెలిపారు.

ప్రధాని సూచనలను రాష్ట్ర అత్యున్నత నాయకత్వం తక్షణం ఆచరణలో పెట్టడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ధనాన్ని, ఇంధనాన్ని ఆదా చేసే దిశగా అగ్ర నేతలు తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story