Chandrababu: రెబల్స్ ఉంటే వెంటనే సస్పెండ్ చేయండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమీక్ష. కూటమి అభ్యర్థులే ఫైనల్ అని స్పష్టం.. రెబల్స్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశం.
Chandrababu: రెబల్స్ ఉంటే వెంటనే సస్పెండ్ చేయండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు ముగిసిన అనంతరం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించారు. కూటమి ఐక్యత, ఎన్నికల వ్యూహం మరియు రెబల్స్ వ్యవహారంపై మంత్రులకు దిశా నిర్దేశం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఖరారు చేసిన కూటమి అభ్యర్థే ఫైనల్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అభ్యర్థుల విజయానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు శ్రమించాలని ఆదేశించారు. పార్టీ ఆదేశాలను దిక్కరించి పోటీలో ఉండే రెబల్స్ ఎవరైనా ఉంటే వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు.
కూటమి ఐక్యతపై ఇటీవల నిర్వహించిన సంయుక్త ప్రెస్‌మీట్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మూడు పార్టీల అభ్యర్థుల విజయానికి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో తీవ్ర సానుకూలత ఉందని సీఎం అన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఎంతో శ్రద్ధతో పరిష్కరిస్తున్నామని పవన్ తెలిపారు.
ప్రస్తుత స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే వరుసగా మిగిలిన ఎన్నికలపై దృష్టి సారించనున్నట్లు సీఎం వెల్లడించారు. స్థానిక పోరు ముగియగానే పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి. పంచాయతీల తర్వాత ప్రాథమిక సహకార సంఘాల (సొసైటీ) ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలన్నీ పూర్తి చేసుకుని పూర్తిస్థాయిలో రాష్ట్ర పాలనపై దృష్టి సారిస్తామని, ఎక్కడైనా విభేదాలు లేదా వివాదాలు ఉంటే మంత్రులు వెంటనే రంగంలోకి దిగి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.




