CM Chandrababu: సింగపూర్‌లో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తనతో పాటు ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను అక్కడ ఘనంగా నిర్వహించారు.
CM Chandrababu: సింగపూర్‌లో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు
CM Chandrababu: సింగపూర్ అధికారిక పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తనతో పాటు పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ జన్మదినాన్ని సీఎం ఎంతో ఆప్యాయంగా జరిపించడం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది.
పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి మంత్రి నారాయణతో కేక్ కట్ చేయించారు. అనంతరం ప్రేమగా కేక్ తినిపించి తన ఆప్యాయతను చాటుకున్నారు. మంత్రి నారాయణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సీఎం చంద్రబాబు అభిలషించారు.
ముఖ్యమంత్రి నుంచి అందిన ఈ ప్రత్యేక శుభాకాంక్షలకు మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అధికారిక పర్యటనలో అనేక సమావేశాలు, కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన పుట్టినరోజును గుర్తుంచుకుని ప్రత్యేకంగా అభినందించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తన జీవితంలో మరపురాని క్షణంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సింగపూర్ పర్యటనలో పాల్గొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రవాస తెలుగు ప్రజలు కూడా మంత్రి నారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సింగపూర్ పర్యటనలో ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రతిబింబించిన ఈ వేడుకలు పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




