Amaravati: అమరావతిలో ఐబీఎం క్వాంటం ఏఐ సెంటర్.. నేడే ప్రారంభం!

Amaravati: అమరావతిలో ప్రతిష్టాత్మక ఐబీఎం (IBM) భాగస్వామ్యంతో 'ఏక్యూఏఐసీ' (AQAIC) సెంటర్ ప్రారంభం.

Arun Chilukuri
Published on: 18 Jun 2026 10:33 AM IST
Amaravati
X

 Amaravati: అమరావతిలో ఐబీఎం క్వాంటం ఏఐ సెంటర్.. నేడే ప్రారంభం!

Amaravati: ఇవాళ ఏపీలో ఏక్యూఏఐసీ సెంటర్ ప్రారంభం కానుంది. IBMతో కలిసి అమరావతి క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు కానుంది. 380 క్వాంటం ఇన్నోవేషన్ సెల్స్ ద్వారా అల్గారిథమ్స్, అప్లికేషన్లని అభివృద్ధి చేయనుంది. క్వాంటం అప్లికేషన్ల అభివృద్ధిలో 3 వేల మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు కృషి చేశారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ఏక్యూఏఐసీ కీలకం కానుంది.

మరో వైపు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సిందేనని ఆదేశించారు. పాలనా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిందని.. తప్పులు జరగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలని సూచించారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల్లో విశ్లేషణ.. ఫిర్యాదులను అర్జీదారులే ట్రాక్ చేసుకునేలా కొత్త వ్యవస్థను తీసుకొస్తామన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story