Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం!
Chandrababu: ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆగస్ట్ 1న జరిగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించారు.
Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం!
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై నాయకులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.
ఆగస్ట్ 1న నిర్వహించనున్న ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్టు 'భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, విమానాశ్రయ ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆహ్వానపత్రికను అందిస్తున్న సమయంలో స్థానిక విజయనగరం ఎంపీ అని కలిశెట్టి అప్పలనాయుడిని ప్రధానికి చంద్రబాబు పరిచయం చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. "అప్పలనాయుడు నాకు తెలుసు, ఆయన రోజూ పార్లమెంట్‌కు సైకిల్‌పై వస్తున్నారు" అని నవ్వుతూ సరాసరి వ్యాఖ్యానించడం విశేషం. ఈ భేటీలో ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపైనా చర్చలు జరిగినట్లు సమాచారం.




