Chandrababu: పెట్టుబడుల వేటలో చంద్రబాబు.. నేడు సింగపూర్ ఉపప్రధానితో భేటీ!
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ధిపై అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు. ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్‌లో చంద్రబాబు పాల్గొంటారు. సెమీకండక్టర్ రంగ విస్తరణపై ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సమావేశాలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో అమరావతి పట్టణాభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు.
ఆ తర్వాత సింగపూర్ ఉపప్రధాని గాన్ కిమ్ యాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 బిజినెస్ రోడ్ షోలో సీఎం పాల్గొంటారు. ఇవాళ రాత్రికి స్వదేశానికి తిరిగి రానున్నారు.
Next Story




