Chandrababu: పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం.. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన ప్రసంగం..
Chandrababu: టిడిపి మహానాడు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రసంగం చేశారు. ఈ మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
Chandrababu: పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం.. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన ప్రసంగం..
Chandrababu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండ్రోజుల 'మహానాడు' పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్‌లో జోష్ నింపుతూ సంచలన ప్రసంగం చేశారు. "జాతీయ జెండా దేశానికి గౌరవమైతే.. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మహానాడుకు వాహనాల జోరు తగ్గినప్పటికీ.. శ్రేణుల్లో ఏమాత్రం జోష్ తగ్గలేదని, తొలిరోజే 1875 క్లస్టర్లలో లక్షలాది మంది పాల్గొని అదరగొట్టారని కొనియాడారు.
ఈ ఏడాది మహానాడును పూర్తిగా మహిళలకు అంకితం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కీలక అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. వంటింటి కష్టాలు తీర్చేందుకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని నిరూపించాం. గంజాయి, డ్రగ్స్, సోషల్ సైకోల తాటతీసి మహిళల గౌరవాన్ని కాపాడుతాం.
నాడు ఐటీ రంగాన్ని తెచ్చి యువత తలరాత మార్చామని గుర్తుచేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తోందన్నారు. ఏఐ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు వంటివన్నీ రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు.
"ఎన్నికల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పాం. కానీ రాబోయే 23 నెలల్లో ఏకంగా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడమే మా లక్ష్యం. వీటికి సంబంధించిన ఎంవోయూలన్నీ (MoUs) పూర్తయితే ఇది కచ్చితంగా సాధ్యమే."
ఒకప్పుడు తాము 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Ease of Doing Business) గురించి మాట్లాడామని, కానీ ఇప్పుడు గేర్ మార్చామని చంద్రబాబు తెలిపారు. ఇకపై రాష్ట్రంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) నడుస్తుందన్నారు. ఏ ప్రాజెక్టు వచ్చినా కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని, రాష్ట్రంలో రాబోయే 288 ప్రాజెక్టులను ప్రారంభించే ముహూర్తాన్ని కూడా ఇప్పటికే నిర్ణయించేశామని స్పష్టం చేశారు.
దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని చంద్రబాబు కొనియాడారు. గతంలో దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు మరియు వేధింపులు ఎదురైనా ప్రజా పోరాటాలు ఆపలేదన్నారు. నరహంతకులు పీకలు కోస్తున్నా కార్యకర్తలు పసుపు జెండాను వీడలేదని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.




