CM Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి శ్రీకారం!

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ కూటమి తరపున కోయంబత్తూరు, హోసూరు, చెన్నైలలో రెండు రోజుల పర్యటన పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 20 April 2026 11:06 AM IST
CM Chandrababu
X

CM Chandrababu: తమిళనాడు ఎన్నికల బరిలో చంద్రబాబు.. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి శ్రీకారం!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల విజయమే లక్ష్యంగా ఆయన రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. దక్షిణాది రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందిన చంద్రబాబు రాకతో, తమిళనాట కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరకు బయలుదేరి వెళ్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి సహా పలు కీలక ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఆయన దృష్టి సారించనున్నారు.

ప్రచారంలో భాగంగా హోసూరులోని తాలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో ఉమ్మడి వ్యూహం, కేంద్రంతో సమన్వయం వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. చంద్రబాబుకున్న క్రేజ్ మరియు దార్శనికత తమిళనాడులో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story