Chandrababu: వైజాగ్ బీచ్ రోడ్డులో చంద్రబాబు సైకిల్ సవారీ.. 5.5 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా తొక్కేసిన సీఎం!
Chandrababu: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ తొక్కి సరికొత్త రికార్డు సృష్టించారు.
Chandrababu: వైజాగ్ బీచ్ రోడ్డులో చంద్రబాబు సైకిల్ సవారీ.. 5.5 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా తొక్కేసిన సీఎం!
Chandrababu: ముందుగా ప్రకటించినట్లే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విశాఖపట్నం (Vizag) వేదికగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అద్భుతమైన అవగాహన కల్పించారు. నగరంలో నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో ఆయన స్వయంగా పాల్గొని సైకిల్ తొక్కుతూ అందరిలోనూ సరికొత్త జోష్ నింపారు. నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు జరిగిన ఈ గ్రీన్ ర్యాలీలో ముఖ్యమంత్రి అత్యంత ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
ఈ వయస్సులోనూ సీఎం చంద్రబాబు తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సైకిల్ యాత్రకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలు ఇలా ఉన్నాయి.
మొత్తం దూరం: 5.5 కిలోమీటర్లు
పట్టిన సమయం: 21 నిమిషాల 18 సెకండ్లు
ర్యాలీ సాగిన రూట్: ఏయూ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన ఈ యాత్ర.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, ఆర్కే బీచ్ రోడ్ మీదుగా సాగి చివరకు నోవాటెల్ హోటల్ వద్ద ముగిసింది.
ర్యాలీ సమయంలో విశాఖలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం అలసట చెందకుండా నిరంతరాయంగా సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా నిలబడి తమ ప్రియతమ నేతను చూసేందుకు వచ్చిన వేలాది మంది ప్రజలకు, అభిమానులకు నవ్వుతూ అభివాదం చేస్తూ పర్యావరణ సందేశాన్ని చాటారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉన్నత ఆశయంతో జరిగిన ఈ మెగా సైకిల్ ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక వైజాగ్ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తమ సైకిళ్లతో చంద్రబాబు వెంట నడిచి ఈ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా రోడ్డుపైకి వచ్చి సైకిల్ తొక్కడం ద్వారా కాలుష్య నివారణ, సహజ వనరుల పొదుపుపై ప్రజల్లోకి బలమైన గ్రీన్ మెసేజ్ వెళ్ళిందని విశ్లేషకులు భావిస్తున్నారు.




