Cyclone Arnab: పరిహారం పంపిణీని వేగవంతం చేయండి: సీఎం చంద్రబాబు
Chandrababu: అర్నబ్ తుపాను పునరుద్ధరణ పనులపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. బాధితులకు త్వరితగతిన పరిహారం అందించాలని కలెక్టర్లకు ఆదేశం.
Cyclone Arnab: పరిహారం పంపిణీని వేగవంతం చేయండి: సీఎం చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన 'అర్నబ్' తుపాను అనంతర పరిస్థితులు, పునరుద్ధరణ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులెవరూ విశ్రమించవద్దని ఆయన స్పష్టం చేశారు.
తుపాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదికను ఈరోజే (గురువారం) నివేదించాలని అధికారులను ఆదేశించారు. పరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని, పంట నష్టం మినహా మిగిలిన బాధితులందరికీ పరిహారాన్ని తక్షణమే అందించాలని ఆదేశించారు.
పంట నష్టాన్ని వేగంగా, పారదర్శకంగా అంచనా వేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని, రైతు వారీగా పూర్తి వివరాలు సిద్ధం చేయాలని సూచించారు.
దెబ్బతిన్న కొబ్బరి సహా ఇతర ఉద్యాన పంటల చెట్లను, మొక్కలను తిరిగి నాటే అవకాశాలను పరిశీలించాలని, అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాలను వర్తింపజేసి వ్యవసాయ, ఉద్యాన రైతులను ఆదుకోవాలని దిశానిర్దేశం చేశారు.
రహదారులపై పడిపోయిన చెట్లను, పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ విపత్తు సమయంలో సమర్థంగా పనిచేసిన అధికారులను అభినందించిన సీఎం, బాధితులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు.




