ఏపీ భూ యజమానులకు గుడ్‌న్యూస్.. 60 రోజుల్లోనే పరిష్కారం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఊరటనిచ్చింది.

G Krishna
Published on: 2 Nov 2026 7:45 PM IST
Andhra Pradesh
X

ఏపీ భూ యజమానులకు గుడ్‌న్యూస్.. 60 రోజుల్లోనే పరిష్కారం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఊరటనిచ్చింది. అసైన్డ్, చుక్కల, ఇనాం , పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 'జి.ఓ.ఎం.ఎస్.నెం.659' (G.O.MS.No.659) ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. దీనివల్ల ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు, మ్యుటేషన్లు, నిషేధిత ఆస్తుల జాబితా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

RDO, తహసీల్దార్ స్థాయిల్లో దరఖాస్తులకు నిర్దిష్ట గడువు

కొత్తగా జారీ చేసిన జీవో ప్రకారం భూములకు సంబంధించిన ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన కాలపరిమితులను ప్రభుత్వం నిర్దేశించింది. ఆర్డీవో (RDO) పరిధిలోని దరఖాస్తులు , తహసీల్దార్ స్థాయికి వచ్చే విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా విచారించి పరిష్కరించాలని ఆదేశించింది. ముఖ్యంగా ఈ దరఖాస్తులన్నింటినీ గరిష్టంగా 60 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అధికారుల చుట్టూ తిరిగే పనిలేకుండా నిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తవుతుండటంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

22A నుంచి తొలగింపునకు ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు

ఈ మార్గదర్శకాలలో మరో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధిత ఆస్తుల జాబితా (22A) నుంచి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేసింది. 22A జాబితా నుంచి భూములను తొలగించడానికి ఇకపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేదా జిల్లాల అధికారుల ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన రికార్డులను సరిచేసి, ఆటోమేటిక్‌గా వెబ్‌ల్యాండ్ (Webland) పోర్టల్‌లో తగిన మార్పులు , చేర్పులు చేయాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది భూ యజమానులకు మేలు జరగనుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.