AP Government: బీసీ రిజర్వేషన్ల కొట్టివేతపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం

AP Government: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం. సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు.

Arun Chilukuri
Published on: 1 Oct 2026 2:29 PM IST
AP Government
X

AP Government: బీసీ రిజర్వేషన్ల కొట్టివేతపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం

AP Government: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 34 శాతం కోటా కల్పిస్తూ జారీ చేసిన రెండు జీవోలను మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయనే కారణంతో రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తమ విధానానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ అంశంపై తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టులో సముచిత న్యాయపోరాటం చేసి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం భావిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.