Talliki Vandanam: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్..'తల్లికి వందనం' వారికి వర్తింపు..!
Talliki Vandanam: ఏపీలో 'తల్లికి వందనం' పథకం లబ్ధిదారుల పెంపు, గురుకులాల మెనూ ఛార్జీల పెంపు , విశాఖలో అకడమిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై కేబినెట్ నిర్ణయం.
Talliki Vandanam: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్..'తల్లికి వందనం' వారికి వర్తింపు..!
Talliki Vandanam: చదువుల తల్లికి దండం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చే మరో అడుగు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంచలన మార్పులకు శ్రీకారం చుడుతూ కూటమి ప్రభుత్వం మరో కీలక కేబినెట్ నిర్ణయాలను వెలువరించింది. అర్హులైన ప్రతి విద్యార్థికీ న్యాయం చేయాలన్న లక్ష్యంతో 'తల్లికి వందనం' పథకంలో లబ్ధిదారుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అర్హత ఉండి కూడా సాంకేతిక కారణాలతో గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైన ఎంతోమంది విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో... క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా గుర్తించిన కొత్త లబ్ధిదారులను కూడా 'తల్లికి వందనం' జాబితాలో చేర్చారు.
సాంకేతిక సమస్యల వల్ల మిగిలిపోయిన మరో 58,601 మందికి తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. దీనికి తోడు, రెండో విడత కింద ఎంపికైన 3,29,201 మంది తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియను అధికారులు క్లియర్ చేశారు.
ఈ తాజా మార్పులతో కలిపి రాష్ట్రంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్న విద్యార్థుల మొత్తం సంఖ్య రికార్డు స్థాయిలో 68,05,791కి చేరుకుంది. ఈ ఒక్క పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి సుమారు రూ.10,208 కోట్ల భారీ వ్యయానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం విశేషం.
కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా, సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ కష్టపడి చదువుకుంటున్న పేద విద్యార్థుల పోషకాహారంపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో... మెనూ ఛార్జీలను 10 శాతం మేర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అట్టడుగు వర్గాల విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చే మహోన్నత లక్ష్యంతో మరో మైలురాయికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం కేంద్రంగా అకడమిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ గిరిజన యువతకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన JEE, NEET లలో నిపుణుల ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నారు.
అంతేకాకుండా, గ్లోబల్ ప్రమాణాలతో కూడిన హయ్యర్ ఎడ్యుకేషన్ పాలసీ-2026 రూపకల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను నేరుగా ఏపీకి రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.




