అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా ఇండక్షన్ స్టవ్‌లు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

Anganwadi scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపును ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 44 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా.

Ravi
By Ravi
Published on: 16 Jun 2026 4:57 PM IST
Anganwadi scheme
X

అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా ఇండక్షన్ స్టవ్‌లు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

Anganwadi scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ కష్టాలను తీరుస్తూ, ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లను అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన కీలక విషయాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా అమలు చేస్తున్న ఇంధన పొదుపు విధానంలో భాగంగా.. ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుందని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఇప్పటికే తొలి విడత కింద రాష్ట్రంలోని 11,400 అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ ఇండక్షన్ స్టవ్‌లను విజయవంతంగా అందించినట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

త్వరలో భారీగా సిబ్బంది నియామకాలు:

కేవలం స్టవ్‌ల పంపిణీ మాత్రమే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఈ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,000 మంది అంగన్‌వాడీ సిబ్బందిని కొత్తగా నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే కేంద్రాల పరిశుభ్రతను మెరుగుపరచడానికి 1,789 మంది పారిశుధ్య కార్మికులను కూడా కొత్తగా విధుల్లోకి తీసుకోనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా చిన్నారులకు, గర్భిణులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా వంట చేసి పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story