AP Gram Panchayat Elections 2026: పల్లె పోరుకు వేళాయే.. ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్‌ అప్‌డేట్స్‌

AP Gram Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 26 జిల్లాల్లోని 3,240 పంచాయతీల్లో ఓటింగ్ జరుగుతుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Arun Chilukuri
Updated on: 26 Nov 2026 12:13 PM IST
AP Gram Panchayat Elections 2026
X

AP Gram Panchayat Elections 2026: పల్లె పోరుకు వేళాయే.. ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్‌ అప్‌డేట్స్‌

AP Gram Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబర్ 26) ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 3,240 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో ఇప్పటికే 709 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

Live Updates

  • ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
    26 Nov 2026 12:12 PM IST

    ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

    మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు వేసిన చంద్రబాబు

    భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌, బ్రాహ్మణి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

  • 26 Nov 2026 12:10 PM IST

    బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోయడంతో నిలిచిన పోలింగ్‌

    సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లి పంచాయతీలో ఉద్రిక్తత

    6, 8 వార్డుల పోలింగ్‌ బూత్‌లలో బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోసిన ఇద్దరు వ్యక్తులు

    ఘటనతో పోలింగ్‌ నిలిపివేత.. రంగంలోకి దిగిన పోలీసులు

    ఘటనపై పోలీసుల విచారణ కొనసాగింపు

  • 26 Nov 2026 12:09 PM IST

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర పునేఠా కామెంట్స్..

    గ్రామ పంచాయితీ ల్లో పోలింగ్ భారీగా జరుగుతోంది..

    ఎంపీటీసీ. జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా గతంలో కన్నా పోలింగ్ బాగా జరిగింది..

    ప్రస్తుతం రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది..

    ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు..

    రాయలసీమ లో కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురు సంఘటన లు జరిగాయి..

    ఎస్పీ లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము..

  • 26 Nov 2026 12:06 PM IST

    మండలాల వారీగా పోలింగ్ శాతం

    జిల్లా మొత్తం పోలింగ్ – 47.47%

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగింపు

    ఉదయం 11 గంటల వరకు జిల్లాలో 47.47 శాతం పోలింగ్ నమోదు

    మొత్తం 4,85,570 మంది ఓటర్లకు గాను 2,30,506 మంది ఓటు వినియోగం

    మహిళా ఓటర్లు 1,17,054 మంది.. పురుష ఓటర్లు 1,13,452 మంది ఓటింగ్

    మండలాల వారీగా పోలింగ్ శాతం:

    * ఐ.పోలవరం – 58.28 శాతం

    * ఉప్పలగుప్తం – 56.13 శాతం

    * మామిడికుదురు – 54.90 శాతం

    * సఖినేటిపల్లి – 50.01 శాతం

    * ముమ్మిడివరం – 50.13 శాతం

    * మలికిపురం – 49.44 శాతం

    * రాజోలు – 49.40 శాతం

    * అమలాపురం – 42.03 శాతం

    * అల్లవరం – 39.22 శాతం

    * కాట్రేనికోన – 34.05 శాతం

    ఐ.పోలవరం మండలంలో అత్యధికంగా 58.28 శాతం పోలింగ్ నమోదు

    ఉప్పలగుప్తం మండలంలో 56.13 శాతం పోలింగ్

    కాట్రేనికోన మండలంలో అత్యల్పంగా 34.05 శాతం పోలింగ్

  • 26 Nov 2026 12:01 PM IST

    అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీ ఎన్నికలు

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రారంభమైన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    10 మండలాల్లో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్

    మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

    10 మండలాల్లో 177 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

    మొత్తం 2,016 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణ

    జిల్లాలో 2,064 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

    5,66,487 మంది ఓటర్లు వినియోగించుకోనున్న ఓటు హక్కు

    29 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

    344 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం

    మొత్తం 2,272 బ్యాలెట్ బాక్సులతో ఎన్నికల నిర్వహణ

    58 సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు

    41 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తింపు

    సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

    78 మంది మైక్రో అబ్జర్వర్లతో పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ

    455 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా

    729 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియ చిత్రీకరణ

    మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

    ఎన్నికల విధుల్లో 2,064 మంది ప్రిసైడింగ్ అధికారులు

    3,691 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నియామకం

    29 మంది జోనల్ ఆఫీసర్లు.. 74 మంది రూట్ ఆఫీసర్ల నియామకం

    ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల నిఘా

    జిల్లా నుంచి మండల స్థాయి వరకు 24 గంటల కంట్రోల్ రూముల ఏర్పాటు

    ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అధికారుల పర్యవేక్షణ

    మొదటి విడతలో ఎన్నికలు జరిగే 10 మండలాలు:

    అల్లవరం, అమలాపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, మల్కిపురం, మామిడికుదురు, ముమ్మిడివరం, రాజోలు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం మండలాల్లో పోలింగ్.

  • 26 Nov 2026 12:00 PM IST

    పశ్చిమగోదావరి జిల్లా

    నరసాపురం మండలం చిట్టవరంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    చిట్టవరం పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ

    పరస్పరం అసభ్య పదజాలంతో దూషించుకున్న ఇరువర్గాలు

    పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

    ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించిన పోలీసులు

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.