AP Heatwave: ఏపీ ప్రజలకు అలెర్ట్.. సోమవారం మండుకోనున్న ఎండలు!

AP Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రతపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం విజయనగరం, మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 26 April 2026 6:57 PM IST
AP Heatwave
X

AP Heatwave: ఏపీ ప్రజలకు అలెర్ట్.. సోమవారం మండుకోనున్న ఎండలు!

AP Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం (27-04-26) రాష్ట్రంలోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 26 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

*ఎక్కడ ఎక్కువ ప్రభావం*?

విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ తీవ్ర వడగాల్పులు ఎక్కువగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ప్రభావం చూపనున్నాయి.

*విజయనగరం జిల్లా*

బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

*పార్వతీపురం మన్యం జిల్లా*

బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు హీట్‌వేవ్ ప్రభావంలోకి వచ్చే అవకాశముంది.

*అల్లూరి జిల్లా*

అనంతగిరి మండలంలో కూడా తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనుంది. మరో 26 మండలాల్లో వడగాల్పులు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అలర్ట్, విజయనగరం 8, మన్యం 1, అల్లూరి 2, పోలవరం 7, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఏలూరు 1, మార్కాపురం 1, వైఎస్సార్ జిల్లా 1 మండలంలో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మార్కాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత. 44.7 డిగ్రీలతో కంభం టాప్. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత మార్కాపురం జిల్లా కంభంలో 44.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దాని తర్వాత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ – 44.1°సి,

వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట – 43.8°C

కర్నూలు నగరడోన, పల్నాడు గురజాల – 43.7°C

నెల్లూరు కొమ్మిపాడు – 43.5°C

అనంతపురం భట్టువానిపల్లి – 43.4°C

శ్రీసత్యసాయి బుక్కపట్నం – 43.2°C

తిరుపతి బేస్తపల్లి – 43.1°C

అన్నమయ్య నూలివీడు – 43°C నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ప్రకాశం జిల్లా మొగిలిచెర్లలో 42°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 41.9°C నమోదైంది. 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా. 16 జిల్లాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 16 జిల్లాలకు చెందిన 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

*ప్రజలకు కీలక సూచనలు*

ఎండలో బయటకు వెళ్తే తప్పనిసరిగా జాగ్రత్తలు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా గుడ్డతో తలను కప్పుకోవాలి. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కళ్ల రక్షణ కోసం నాణ్యమైన సన్‌గ్లాసెస్ ఉపయోగించాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు సూచించారు.

*ఎక్కువగా తీసుకోవాల్సినవి*

నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా వడదెబ్బ ప్రమాదాన్ని నివారించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story